దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్!
CM KCR | ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై
హైదరాబాద్ : ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో చర్చించారు. దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్ఎస్ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. సమావేశం అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు.
రేగ కాంతారావు మాట్లాడుతూ 5న సీఎం కేసీఆర్ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారన్నారు. దేశ ప్రజలు, యువతా సీఎం కేసీఆర్ రాక కోసం చూస్తున్నారని, కొన్ని పార్టీలు విలీనం కావడంతో పాటు మరికొన్ని పార్టీలు కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నింటిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ వివరిస్తారన్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమై.. పార్టీలో అందరితో చర్చించి తీర్మానం పెట్టనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేస్తారన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ మేధస్సును భారత ప్రజలంతా కోరుకుంటున్నారని, కనుకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ నెల 5న గొప్ప నిర్ణయాన్ని ప్రకటించనున్నారన్నారు. భారతదేశ ప్రజల తలరాతను మార్చే గొప్ప నిర్ణయం దసరా రోజు ప్రకటిస్తారన్నారు. సమావేశంలో భారతదేశ రాజకీయాల్లోకి రావాలని తామును సీఎంను కోరినట్లు కవిత తెలిపారు. తెలంగాణ బిడ్డలు అందుకుంటున్న అభివృద్ధి ఫలాలను.. యావత్ దేశ ప్రజలకు అందించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు పేర్కొన్నారు. బీజేపీ మొండి వైఖరి కారణంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదని, రాష్ట్ర యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

