Kavitha | రామానుజపురంలో కేసీఆర్ ఇంటర్నెట్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రారంభించారు. దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా రామానుజపురంలో సొంతం ఖర్చులతో ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు.
నర్సింహులపేట, ఫిబ్రవరి 24: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్ కోసం తన సొంతఖర్చుతో ఏర్పాటు చేసిన జిరాక్స్ సెంటర్‌ను ఎమ్మెల్సీ కవిత (Kavitha) ప్రారంభించారు. దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించిన కవిత.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా రామానుజపురంలో సొంతం ఖర్చులతో ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రామానుజాపురం వెళ్లిన ఆమె.. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మరిపెడ మండలం చిల్లంచర్లలో జాగృతి మహిళా నేత మరిపెల్లి మాధవి గృహప్రవేశానికి హాజరవుతారు.

అడిగిన వెంటనే అభయం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చిర్రా సతీశ్‌కు చిన్నప్పటి నుంచే కేసీఆర్ అంటే ఎంతో అభిమానం. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు, అంగవైకల్యాన్ని ఎదిరించి ఆత్మైస్థెర్యంతో డిగ్రీ పూర్తి చేశారు. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తనకు ల్యాప్‌టాప్, జిరాక్స్ మిషన్ కొనిపించి స్వయం ఉపాధికి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్పీ కవితకు మెస్సేజ్ చేశారు. ఆమె వెంటనే స్పందించి అభయమిచ్చారు. వారం కూడా తిరగకముందే ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్‌కు కావాల్సిన పరికరాలను సమకూర్చారు. కాగా, ఈ ఇంటర్నెట్ సెంటర్‌కు తన అభిమాన నేత కేసీఆర్ పేరును సతీశ్ పెట్టారు. పెద్ద మనస్సుతో సాయం చేసిన ఎమ్మెల్సీ కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, కవితకు తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని చెప్పారు.
కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు..
ఇంటర్నెట్-జీరాక్స్ సెంటర్ ఏర్పాటుపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ మనకు నేర్పిన బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని చిర్రా సతీష్‌కి స్వయం ఉపాధి కల్పించడం తన బాధ్యతగానే భావించానని తెలిపారు. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వెల్లడించారు. సతీష్ గారి ‘కేసీఆర్ ఇంటర్నెట్-జిరాక్స్’ సెంటర్ ను ప్రారంభించే అవకాశం నాకు కలగడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
కార్యకర్తలే పార్టీకి ఆయువుపట్టు !
కార్యకర్తలకు అండగా ఉండడం కేసీఆర్ గారు మనకు నేర్పిన బాధ్యత !!బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, కేసీఆర్ గారి వీరాభిమాని చిర్రా సతీష్ గారికి స్వయం ఉపాధి కల్పించడం నా బాధ్యతగానే భావించాను. కార్యకర్తలు, వారి కుటుంబాలకు అన్ని రకాల మద్దతు ఇవ్వడంలో ముందుండే… pic.twitter.com/hLJkiYJErq
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 24, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- kavitha
- KCR
- Ramanujapuram
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

