కార్తిక సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Karthika masam | కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
హైదరాబాద్: కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేకమైన రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలను నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలించారు. స్వామివారి దర్శనం కోసం భారీసంఖ్యలో క్యూలైన్లలో వేచిఉన్నారు. ఇక భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తిక దీపాలను నదిలో వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కార్తిక దీపాలు వెలిగించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

