తప్పుల తడకగా ల్యాబ్ టెక్నీషియన్ మెరిట్ జాబితా!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల భర్తీకి కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు.
- ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్
కరీంనగర్ విద్యానగర్, నవంబర్ 13 : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల భర్తీకి కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు. కరీంనగర్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ జాబితా పరిశీలిస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయని, ఒకే అభ్యర్థి పేరును పలుమార్లు నమోదు చేయడంతో పాటు మారుల గణనలోనూ తప్పులు దొర్లాయని ఆధారాలతో వివరించారు.
అధికారులు విడుదల చేసిన జాబితాలో సీహెచ్ నరేశ్ (తండ్రి నర్సయ్య) అనే అభ్యర్థి పేరు సీరియల్ నంబర్ 59 నుంచి 63 వరకు వరుసగా ఐదుసార్లు ముద్రితమైందని తెలిపారు. ఎస్ రాజు (తండ్రి సమ్మయ్య) పేరు 124 నుంచి 127 వరకు వరుసగా నాలుగుసార్లు, బీ మధుసూదన్ (తండ్రి లింగయ్య) పేరు 98, 99 సీరియల్ నంబర్లలో రెండుసార్లు నమోదైందని వెల్లడించారు. ఒకే అభ్యర్థి పేర్లు పలుమార్లు జాబితాలో కనిపించడం నియామక ప్రక్రియలో జరిగిన నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. డూప్లికేట్ పేర్లను సైతం గుర్తించకుండా జాబితా విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

