కాళోజీ హెల్త్ వర్సిటీలో ఏడుగురి అడ్మిషన్ల రద్దు
నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీటు పొందిన ఏడుగురు వైద్యవిద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. 2023-24 నీట్ పరీక్షలో అర్హత సాధించి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయంలో నకిలీ స్టడీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి స్థానిక కోటాలో సీట్లు పొందినట్టు వర్సిటీ అధికారులు నిర్ధారించారు.
- నకిలీ సర్టిఫికెట్లు చూపించి సీటు పొందినవారిపై కేసు నమోదు
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్30: నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీటు పొందిన ఏడుగురు వైద్యవిద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. 2023-24 నీట్ పరీక్షలో అర్హత సాధించి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రిజిస్ట్రేషన్ సమయంలో నకిలీ స్టడీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి స్థానిక కోటాలో సీట్లు పొందినట్టు వర్సిటీ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు వారి అడ్మిషన్లను రద్దు చేయడంతోపాటు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినందుకు వరంగల్‌లోని మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ చెందిన పోపుల సుబ్రహ్మణ్య సాయితేజ, వానిపెంట సాయిప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజారెడ్డి, అరికట్ల హనుమాన్‌రెడ్డి, టేకుపల్లి మహేశ్, గేర్లె భార్గవ ధర్మతేజ యశ్వంతనాయుడు, ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన తన్నీరు సంజయ్ నకిలీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయగా, వారికి విజయవాడకు చెందిన కన్సల్టెంట్ నిర్వాహకుడు కామిరెడ్డి నాగేశ్వర్రావు సహకరించారు. విష్ణుతేజారెడ్డి, సంజయ్ విచారణకు హాజరైనట్టు సమాచారం. కామిరెడ్డి నాగేశ్వర్రావు విచారణకు హాజరైతే అసలు విషయాలు బయటపడుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

