కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్ వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. నీట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వచ్చే నెల 2వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు.
నిర్దేశిత దరఖాస్తులు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.In లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.