బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలు, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్ మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
మంగళవారం నగరంలోని ఖైరతాబాద్ రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ మోటాల్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపరవాణా కమిషనర్ డాక్టర్ కే పాపారావు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రోడ్డు భద్రతపై అవగాహన, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై రవాణాశాఖ అధికారులతో కమిషనర్ చర్చించారు.