హైకోర్టు సీజేగా రేపు జస్టిస్ ఎస్సీ శర్మ ప్రమాణస్వీకారం
Justice SC Sharma | హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్

హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో నూతన సీజే ఎస్సీ శర్మతో ప్రమాణం చేయించనున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
బంగారు పతకాల విజేత జస్టిస్ శర్మ
జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 1961 నవంబర్ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరొందిన ఆయన తండ్రి బీఎన్ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జబల్పూర్లో ఇంటర్, సాగర్‌లోని హరిసింగ్‌గౌర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్ఎల్బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించడం విశేషం. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానల్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.
నాలుగో సీజే
2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ 4వ వారు. తొలి సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, అనంతరం జస్టిస్ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

