పేరపళ్ల రైతులకు న్యాయం చేస్తాం
నారాయణపేట తహసీల్దార్ అమరేంద్ర.. నమస్తే తెలంగాణ ఎఫెక్ట్‌తో రీసర్వే.
నారాయణపేట రూరల్, అక్టోబర్ 6 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులందరికీ న్యాయం చేస్తామని పేట తహసీల్దార్ అమరేంద్రకృష్ణ పేర్కొన్నారు. నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే చెరువుకట్ట పనులకు సంబంధించి మార్కింగ్ చేపడతామన్నారు. పంటలు నష్టపోతున్న రైతులకు పరిహారం త్వరలోనే వారి అకౌంట్లలో వేయనున్నట్లు తెలిపారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో నష్టపరిహారం విషయంపై కథనాలు రావడంతో అధికారులు ఇటీవలే రీసర్వే పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టాలున్న రైతుల భూములను రీసర్వే చేశారు. సర్కార్ భూములు, అసైన్డ్ భూములపై సందిగ్ధం నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

