Justice Narasimha Reddy | ముఖం చాటేసిన జస్టిస్ నర్సింహారెడ్డి
బీఆర్కేభవన్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘు కమిషన్ ముందు హాజరై మ. 12:33 గంటల ప్రాంతంలో విచారణ ముగిసింది.
- మీడియాతో మాట్లాడకుండా వెళ్లిన విద్యుత్తుపై విచారణ కమిషన్ చైర్మన్
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్కేభవన్లోని విచారణ కమిషన్ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ నర్సింహారెడ్డి చేరుకున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘు కమిషన్ ముందు హాజరై మ. 12:33 గంటల ప్రాంతంలో విచారణ ముగిసింది. జస్టిస్ నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడతారనుకొని ప్రతినిధులంతా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ లేఖ సంధించిన నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డి స్పందిస్తారని అనుకున్నారు. అప్పుడే కమిషన్ కార్యాలయంలో ఉండొద్దని పోలీసులు సూచించారు. మీడియా ప్రతినిధుల వాగ్వాదంతో ఆఖరుకు పోలీసులు శాంతించారు. ప్రొఫెసర్ కోదండరాం, రఘు బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ వెంటే ఒకటిన్నర గంటల ప్రాంతంలో జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి సైతం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ఉత్సుకత చూపే ఆయన ఇలా ముఖం చాటేసి వెళ్లడమేంటని మీడియా ప్రతినిధులు గుసగుసలాడటం కనిపించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

