హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నూతన చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జున నియమితులయ్యారు. ఆ యనను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వనపర్తి జిల్లాకు చెం దిన నాగార్జున..ప్రాథమిక విద్యాభ్యాసం అదే జిల్లాలో కొనసాగించారు. డిగ్రీ ఆర్ఎల్డీ కాలేజీలో, గుల్బర్గాలోని ఎస్ఎస్ఎల్ కాలేజీలో లా, ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తిచేయగా, అమెరికాలోనూ పలు న్యాయకోర్సులు అభ్యసించారు. 1986లో న్యాయవాదిగా, 1991 మే1న జూనియర్ సివి ల్ జడ్జిగా ఎంపికయ్యా రు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2019లో కామారెడ్డి జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. 2022లో హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023లో మద్రాస్ హైకోర్టుకు బ దిలీ అయ్యి అక్కడే విరమణ పొందారు.