Central budget | కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం : జూలకంటి రంగారెడ్డి
Central budget | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు.
మిర్యాలగూడ, జూలై 26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో(Central budget) తెలంగాణకు(Telangana) తీరని అన్యాయం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి (Julakanti Rangareddy )విమర్శించారు. మోదీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు చేసిందన్నారు. శుక్రవారం సీపీఎం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలో కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ అమలు చేయడం లేదన్నారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, యూనివర్సిటీ ఏర్పాటు, మూసీ నది ప్రక్షాళన, ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలను తుంగలో తొక్కిందని పేర్కొన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఏపీకీ రూ.15వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం అవసరమైన నిధుల కేటాయింపు జరుగలేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నేతలు డబ్బికార్ మల్లేశ్, వెంకటేశ్వర్లు, పాండు, అంజద్, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, అప్పారావు, ఏసు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

