జర్నలిస్టుల భవన్‌కు స్థలం
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది.
- ఉప్పల్ భగాయత్‌లో టీయూడబ్ల్యూజేకు…
- 1847 గజాల స్థలం కేటాయిస్తూ సర్కార్ జీవో
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సంఘం థ్యాంక్స్
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్’ నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ ధన్యవాదాలు తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్ సమక్షంలోనే టీయూడబ్ల్యూజే ఏర్పడిందని అన్నారు. నాటినుంచి టీయూడబ్ల్యూజే చేస్తున్న కృషితోపాటు ముఖ్యమంత్రికి జర్నలిస్టుల పట్ల ఉన్న సానుకూల వైఖరి, ఔదార్యం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. త్వరలోనే భవన నిర్మాణానికి అందరి సహకారంతో చర్యలు చేపడతామని చెప్పారు.
జర్నలిస్టుల భవన్ కోసం గత ఐదు సంవత్సరాలుగా యూనియన్ నాయకుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు రమేశ్ హజారే కృషి చేశారని గుర్తుచేశారు. టీయూడబ్ల్యూజేకు అనుబంధంగా ఉన్న జర్నలిస్టు సంఘాలకు, వాటి కార్యక్రమాలకు ఈ భవన్ కేంద్రంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేశ్ హజారే, యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, యోగానంద్, తెంజూ అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, కార్యదర్శి రమణ, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్(టీపీజేఏ) అధ్యక్షుడు జీ భాస్కర్ నాగరాజు, హరీశ్ నండూరి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం
జర్నలిస్టు భవన్ కోసం స్థలం మంజూరు చేసినందుకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాత్రికేయులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతిసాగర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్ట్ సంఘ నాయకులు సంబురాలు చేసుకొంటున్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

