ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్
సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల జరిగిన మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్టు శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దవాఖానలో జరుగుతున్న వైద్యుల నిర్లక్ష్యం, మరణాలు, నిరసనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయడం వల్లనే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. గోపాలపురం పోలీసులు గురువారం ఉదయం శంకర్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
- మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల జరిగిన మరణాలపై ప్రశ్నించిన జర్నలిస్టు శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దవాఖానలో జరుగుతున్న వైద్యుల నిర్లక్ష్యం, మరణాలు, నిరసనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయడం వల్లనే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. గోపాలపురం పోలీసులు గురువారం ఉదయం శంకర్ ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 16న మెడికవర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. జర్నలిస్టు శంకర్‌పై బీఎన్ఎస్లోని 126(2), 115(2), 351(2), 329, 324, 352, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్టు శంకర్ అరెస్టును జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికవర్ ఘటనలపై పూర్తి వివరాలు బయటకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ కేసులు అన్యాయం: నిరంజన్ రెడ్డి
జర్నలిస్టు శంకర్‌పై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల మీద కరశంగా దాడి చేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇదే రీతిలో అణచివేత ధోరణితో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. శంకర్‌పై అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రశ్నిస్తే గొంతు నొకడమే: పల్లె రవికుమార్
చిన్నారి గుణశ్రీ మృతిపై ఆమె కుటుంబసభ్యులు మెడికవర్ దవాఖాన ముందు నిరసన తెలుపుతున్న వీడియోలు చిత్రీకరించి ప్రజలకు వాస్తవాలను చేరవేసిన శంకర్‌గౌడ్‌ను తీవ్రంగా గాయపరచడం, కేసు నమోదు చేయడం దుర్మార్గమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ ఖండించారు. తెలంగాణలో రేవంత్ హిట్లర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.
జర్నలిస్టు శంకర్ అరెస్ట్ సిగ్గుచేటు: హరీశ్‌రావు
జర్నలిస్టు శంకర్ అరెస్టును మాజీ మంత్రులు హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యత అని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం మీడియా ప్రాథమిక హకు అని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్రమ వ్యాపార వ్యవహారాలపై ప్రశ్నించినందుకే శంకర్‌ను అరెస్టు చేశారని, ఇది అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, ప్రశ్నలను ఎదురొనే ధైర్యం లేక జర్నలిస్టులపై చర్యలకు దిగడం సరార్కు అలవాటుగా మారిందని, ఇది స్పష్టంగా మీడియా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. శంకర్‌ను వెంటనే విడుదల చేయాలని, మీడియా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

