హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూహెచ్ కూడా దసరా సెలవు తేదీలను ఈ నెల 13 నుంచి 26 వరకు ప్రకటించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమా ర్ కోరారు. బతుకమ్మ, దసరా ప్రధాన పండుగలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు 13 నుంచి 26 వరకు సెలవులిచ్చిందని తెలిపారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కూడా ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలనే పాటిస్తున్నాయని గుర్తుచేశారు. కానీ, జేఎన్టీయూహెచ్ మాత్రం 23 నుంచి 28 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.