JEE Main Results | జేఈఈ మెయిన్-1 ఫలితాలు విడుదల.. నలుగురు తెలంగాణ విద్యార్థులకు 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Results) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ఉదయం విడుదల చేసింది. ఎన్టీఏ అధికార వెబ్సైట్ https://jeemain.nta.ac.in/ లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో పర్సంటైళ్లతోపాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు. ఇందులో తెలంగాణకు చెందిన విధిత్, సాయితేజ, అనూప్, దినేశ్ రెడ్డిలు 300లకు 300 మార్కులు సాధించి 100 పర్సంటైల్ పొందారు.
ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సెషన్-2ను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు సెషన్లు పరీక్ష రాసిన వాళ్లకు) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు.

తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. ఎన్ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

