త్వరలోనే జనగామ టీఆర్ఎస్ జల్లా కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | జనగామ టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

జనగామ : జనగామ టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని, ఆయా కార్యాలయాలను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి తెలిపారు.

జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళోజీ, జ్యోతిరావు ఫూలే, సావిత్రి ఫూలే విగ్రహాలను పరిశీలించారు.
కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలిపారు. త్వరలోనే సీఎంతో మాట్లాడి మరో డేట్ తీసుకుంటామని తెలిపారు.

పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

