నకిలీ బంగారం తాకట్టుపెట్టి లక్షల్లో రుణాలు.. ఘరానా మోసగాడి అరెస్టు
Cheater arrested in Jadcharla: నకిలీ బంగారం కుదువపెట్టి లక్షల్లో రుణాలు తీసుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

మహబూబ్‌నగర్: మహాబూబ్‌నగర్ జిల్లాలో నకిలీ బంగారం కుదువపెట్టి లక్షల్లో రుణాలు తీసుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మతంగి వరప్రసాద్ అనే వ్యక్తి గతంలో తెలంగాణ హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు.
అయితే, చెడు అలవాట్ల కారణంగా డ్యూటీలకు సరిగా వెళ్లకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో సులువుగా డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేయడం కోసం నకిలీ పేర్లతో ఆధార్, పాన్ కార్డులు సృష్టించుకుని నకిలీ బంగారాన్ని మణప్పురం ఫైనాన్స్‌లో తాకట్టుపెట్టి లోన్స్ ఎగ్గొట్టడం మొదలెట్టాడు. ఆగ్రాకు చెందిన వినోద్, సికిందర్ అనే ఇద్దరు బంగారం పూత వేసే వ్యక్తులను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు.
ఇప్పటివరకు కర్నూలు, ప్రకాశం, చిలుకలూరిపేట, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లోని మణప్పురం ఫైనాన్స్‌లలో రూ.58 లక్షల రుణాలు తీసుకున్నాడు. ఇదే తరహాలో జడ్చర్లలోని మణప్పురం ఫైనాన్స్‌లో గత నెల 25న నకిలీ ఆధార్‌తో లోన్ కోసం వచ్చాడు. ఫైనాన్స్ సిబ్బందికి అనుమానం రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అత్తపూర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదేగాక గతంలో కూడా నిందితుడికి నేర చరిత్ర ఉన్నదని పోలీసులు తెలిపారు. 2016లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంపెనీ పెట్టిస్తానని ఒకరిని మోసం చేశాడు. ఆలాగే 2019లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన కేసుల్లో జైలుకెళ్ళి బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా, పట్టుబడ్డ నిందితుడి నుంచి 45 నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

