భూములు గుంజుకుంటే ఆత్మహత్యే.. గౌరవెల్లి సర్వేను అడ్డుకున్న రైతులు
గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవారం భూసర్వేకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను రైతులు అడ్డుకున్నారు.
- 13 ఎల్ కెనాల్నిర్మాణం కోసం భూములు ఇవ్వబోమని స్పష్టీకరణ
- హుస్నాబాద్‌లో పురుగుమందు డబ్బాలతో అన్నదాతల ఆందోళన
హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 28: గౌరవెల్లి కాలువ నిర్మాణానికి తాము భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు నుంచి దాదాపు కిలోమీటరుపైగా గౌరవెల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ 13 ఎల్ నిర్మాణం కోసం మంగళవారం భూసర్వేకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. హుస్నాబాద్‌లో పురుగు మందుల డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని కాలువ కోసం తీసుకుంటే తామెలా బతకాలని నిలదీశారు.
భూములు తీసుకోవద్దని ఇప్పటికే చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చామని, దౌర్జన్యంగా, దొంగచాటుగా సర్వేకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. సర్వే నిలిపివేయకపోతే ఇక్కడే మందుతాగి చస్తామంటూ బెదిరించారు. దీంతో ఇరిగేషన్ ఏఈ నెహ్రూ ఆధ్వర్యంలోని అధికారులు సర్వేను నిలిపివేసి డీఈఈ, తహసీల్దార్‌కు సమాచారం తహసీల్దార్ లక్ష్మారెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇప్పటికే నిర్మించిన కాలువ నుంచి నీటిని ఎత్తిపోయాలని, కొత్త కాలువ నిర్మాణం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు.
అలైన్మెంట్ మార్చేందుకు అవకాశం ఉన్నా, ఎందుకు మార్చడంలేదని ప్రశ్నించారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణానికి భూమిపోయిందని, లక్షల రూపాయలు పెట్టి ఇంటి స్థలం కొన్నామని, ఇక్కడ కూడా కాలువ తీస్తే ఎలా బతకాలని రైతు లావుడ్యా బీమానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములు ఉన్న ఇండ్లకెల్లి కాలువలు తీస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇప్పటికే తనకు గుండెపోటు వచ్చిందని రైతు మర్యాల మహేశ్వర్‌రెడ్డి అధికారులతో వాపోయాడు. అలైన్మెంట్ మార్చకపోతే పెట్రోలు పోసుకుంటానని కాంగ్రెస్ నాయకుడు బూరుగు కిష్టస్వామి పెట్రోల్డబ్బా చూపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి చర్చించి చర్యలు తీసుకుంటామని తహహసీల్దార్ లక్ష్మారెడ్డి, డీఈఈ ప్రశాంత్ రైతులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

