భీంరెడ్డి బినామీ ఆస్తులపై ఐటీ చర్యలు!
పోలీసు అధికారి సంకిరెడ్డి భీంరెడ్డి వ్యవహారంలో బినామీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోలీసు అధికారి సంకిరెడ్డి భీంరెడ్డి వ్యవహారంలో బినామీ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ దృష్టి సారించింది. పటాన్చెరు ఎస్డీపీవోగా భీంరెడ్డి పనిచేసిన సమయంలో జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన వివాదాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా రెండు ఇండ్లను బదిలీ చేసినట్టు బీపీయూ అనుమానిస్తున్నది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు ఇండ్లను 2023 జూలైలో పోతుగంటి ఇంద్రకరణ్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు.
ఒకో ఇంటి విలువ రూ.14.2 లక్షలుగా పేరొన్నారు. కొన్ని ఫిర్యాదులు నమోదు చేయకుండా ఉండటం, సంస్థ వివాదాలను పరిషరించడంలో సహాయంచేయడంతో ప్రతిఫలంగా ఇండ్లను ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ డైరెక్టర్ కల్యాణ్‌బాబు వాంగ్మూలం లో ఆ ఇండ్లను కృతజ్ఞతకు గుర్తుగా ఇచ్చినట్టు ఆయన పేరొన్నారని దర్యాప్తు రికార్డుల్లో నమోదుచేసినట్టు సమాచారం. మరోవైపు, ఇంద్రకరణ్‌రెడ్డి కూడా భీంరెడ్డి సూచన మేరకే తన పేరును లావాదేవీలకు ఉపయోగించేందుకు అనుమతించినట్టు విచారణలో వెల్లడించారని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

