Skill Development | 80 బడుల్లో వొకేషనల్ విద్య.. పాఠశాల దశలోనే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ
పదోతరగతి వరకే చదివాను.. ఇంటర్ మాత్రమే పూర్తిచేశాను ఈ విద్యార్హతలతో ఉద్యోగాలు సంపాదించడం ఎలా? చదువుకున్న చదువు.. తెచ్చుకొన్న మార్కులతో ప్రయోజనమేమి లేదే.
- 9, 11 తరగతుల్లో శిక్షణ
- 10, 12 తరగతుల్లో ప్రాక్టికల్స్ , పరీక్షలు
Skill Development | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వరకే చదివాను.. ఇంటర్ మాత్రమే పూర్తిచేశాను ఈ విద్యార్హతలతో ఉద్యోగాలు సంపాదించడం ఎలా? చదువుకున్న చదువు.. తెచ్చుకొన్న మార్కులతో ప్రయోజనమేమి లేదే. మరీ ఇప్పుడెలా అన్న సంకోచక స్థితి నుంచి విద్యార్థులను బయటపడేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. పాఠశాల దశలోనే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.
ఇలా రాష్ట్రంలోని 80 బడుల్లో వొకేషనల్ విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు 66 కేజీబీవీలను, 14 తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ గురుకులాలను ఎంపికచేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2023-24 సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్బోర్డులో ఈ స్కూళ్లల్లో వొకేషనల్ విద్య అమలుకు ఆమోదం లభించింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తారు. ఎంపిక చేసిన బడుల్లోని 9, 11 తరగతుల్లో శిక్షణ ఇస్తారు. 10, 12 తరగతుల్లో ప్రాక్టికల్స్, పరీక్షలను నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ శిక్షణనిచ్చేందుకు పలు సంస్థలతో ఎంవొయూ కుదుర్చుకొన్నారు.
కోర్సులివే..
డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్, మైక్రోఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, హోం హెల్త్ ఎయిడ్ ట్రెయినీ, అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సొలనాసియస్ క్రాప్ కల్టివేటర్, జామ్ జెల్లీ కెచప్ ప్రాసెసింగ్ టెక్నీషన్, ఆప్టికల్ ఫైబర్ స్పిసర్, స్వీయింగ్ మిషన్ ఆపరేటర్ వంటి కోర్సులున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

