Tiger | పులికి అడవులే ఆవాసం. అక్కడి నీటి చెలిమెలో దాహార్తిని తీర్చుకుంటుంది. కానీ దాని పరిసరాల్లోకి మనిషి వెళ్తున్నాడు. కలుషితం చేస్తున్నాడు. పర్యావరణానికి హాని కలిగిస్తూ అడవినీ బలిపెడుతున్నాడు. ప్లాస్టిక్ వాడకంపై మనుషులకు కనువిప్పు కలిగేలా వ్యవహరించిందో టైగర్.
మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలోని తడోబా నేషనల్ పార్కులో ఓ కొలనులో సందర్శకుడు పారేసిన ప్లాస్టిక్ బాటిల్ ఓ పులి కంటపడింది. అది ఆ చెరువులోకి దిగి ఆ బాటిల్‌ను నోట కరుచుకొని బయటకు తెచ్చి చెత్తను ఉంచేచోట పడేసింది. పులి చొరవను అక్కడే ఉన్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ దీప్ కతికర్ తన కెమెరాలో బంధించారు. పులి కాదు.. స్వార్థంకోసం పర్యావరణాన్ని బలిపెడుతున్న మనిషి కదా అసలైన క్రూరజీవి!