రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లా రైతుల పరిస్థితి. ఎల్ నినో నేపథ్యంలో రైతులు, ప్రజలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, కాలువల్లో నీటిని మోటర్ల ద్వారా వినియోగించొద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.
- చెరువులు, వాగుల్లోనూ మోటర్లు పెట్టవద్దు
- నీటిని వాడుకుంటే కఠిన చర్యలు తప్పవు
- రైతులకు నీటిపారుదల అధికారుల ఆదేశాలు
- కండ్లముందు ఎండుతున్న వరి, పత్తిచేన్లు
- ఒకట్రెండు తడులు ఇస్తే గట్టెక్కే అవకాశం
- పంటలను కాపాడుకొనేందుకు తీవ్ర పాట్లు
- సర్కార్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు
ఆదిలాబాద్, అక్టోబర్ 16 ( నమస్తే తెలంగాణ) : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది ఆదిలాబాద్ జిల్లా రైతుల పరిస్థితి. ఎల్ నినో నేపథ్యంలో రైతులు, ప్రజలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, కాలువల్లో నీటిని మోటర్ల ద్వారా వినియోగించొద్దని నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఒకవేళ వినియోగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఆ ఆదేశాల కాపీలను తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ, విద్యుత్తు శాఖ అధికారులకు వారు అందజేశారు. జిల్లాలో వానకాలంలో రైతులు 5.81 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయగా 4.31లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించారు. కాయల నుంచి దూది విచ్చుకునే దశలో ఉన్న పత్తికి ఒకటి రెండు తడులు అవసరమవుతాయి. ఈ సమయంలో అధికారులు సాగునీటి వనరు ల్లో నుంచి నీటిని వాడొద్దని ఆదేశాలు జారీ చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుడు అధిక వర్షాలతో పంటలు నష్టపోగా, ఈ సారి అధికారులు తీసుకున్న నిర్ణయంతో మరింత నష్టపోయేలా ఉన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చేతికొచ్చిన పంట ఎండుముఖం
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం పత్తి పంట అధికంగా సాగువుతుంది. మరో 15 నుంచి 20 రోజుల్లో దూది పూర్తిగా విచ్చుకుంటుంది. డిసెంబర్ వరకు పంట పూర్తిస్థాయిలో చేతికి రానున్నది. ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు సైతం కురువడం లేదు. ప్రస్తుతం పత్తి చేలకు నీటి అవసరం ఉండగా, రైతులు తమకు సమీపంలోని చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు, కాలువల నుంచి కరెంటు మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తమ పంట పొలాలకు మళ్లించుకుంటున్నారు. కరెంటు కోతలను సైతం తట్టుకొని భగీరథ ప్రయత్నాలు చేసి పత్తి పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి ఆపత్కాలంలో నీటిపారుదల శాఖ అధికారులు నీటి వినియోగంపై ఆంక్షలు విధించడం రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేసినట్టయింది.
ఎకరాలకు రూ.40 వేలు ఖర్చు
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి చేలను కాపాడుకునేందుకు రైతులకు ఆర్థిక భారం పెరిగింది. పంట ఎదుగుదల కోసం అధిక మొత్తంలో మందులు వాడటంతో పెట్టుబడులు పెరిగాయి. ఎకరా పత్తి పంట సాగుకు రూ.40 వేల వరకు వెచ్చించాల్సి వచ్చిందని అన్నదాతలు అంటున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులతో సాగుచేసిన పంటలు అధికారుల నిర్ణయం కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భజలాల ఇంకిపోతున్నా పట్టించుకోని అధికారులు.. తాము పంటలను కాపాడుకునేందుకు నీటిని వాడుకుంటే చర్యలు తీసుకోవడం ఏందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అండగా నిలిచిన కేసీఆర్..
ఎస్సారెస్పీతోపాటు, కాకతీయ కాలువ పొడవునా సూర్యాపేట వరకు గతంలో రైతులు కాలువలపై ప్రత్యేకంగా ఎక్కడికక్కడ 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటర్లను అమర్చుకుని పంటలను పండించుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సైతం రైతులకు అండగా నిలిచింది.

రైతులు కాలువలో వేసుకున్న మోటర్లను తొలగించవద్దని అప్పట్లో అధికారులను ఆదేశించింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఆ మోటర్లను తొలగిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికొచ్చే టైమ్‌లో మోటర్లు తొలగిస్తే ఎలా రైతులు ప్రశ్నిస్తున్నారు. – హైదరాబాద్, నమస్తే తెలంగాణ
మోటార్లను తీసేయమంటున్న రేవంత్..

ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి గ్రామ సమీపంలో వాగులో మోటర్లు పెట్టి పంటకు నీటిని వినియోగించుకుంటున్న రైతులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

