హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో వివిధ విభాగాలలో 121 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16న ఉ.9గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు-3, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు -73, ట్యూటర్స్-8, సీనియర్ రెసిడెన్సీలు-37 పోస్టులను ఏడా ది కాలానికి భర్తీ చేస్తామని వెల్లడించారు.