ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన : మంత్రి తలసాని
హైదరాబాద్ : విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నూతనంగా BOT పద్ధతిలో నిర్మించిన అత్యాధునిక టాయిలెట్స్ ను మంత్రి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLA సాయన్న లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ వద్ద మొట్టమొదటగా వాటర్ లెస్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాలలో GHMC ఆధ్వర్యంలో ఇలాంటి మోడరన్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ప్రజలు కూడా GHMC ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రహదారుల అభివృద్ధి, విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, సీవరేజ్, తాగునీరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EE సుదర్శన్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, మోడరన్ టాయిలెట్స్ నిర్వహకులు రంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

