టొరంటోలో లక్ష మోదకాలతో ఘనంగా వినాయక చవితి సంబరాలు..

దేశాలు దాటినా తగ్గని భక్తి, ఖండాలు దాటినా మారువని సంస్కృతి.. ఇదీ భారతీయ జీవనశైలి అనేలా ప్రవాస భారతీయులు గణపయ్యకు ఘనంగా పూజలు చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభమైనప్పటి నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. కెనడాలోని టొరంటోలో ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. ఈ నెల 11న లక్ష మోదక హోమంతో వినాయక చవితి సంబురాలు చేసుకున్నారు. జీఆర్డీ అయ్యర్స్ గురుకుల్ వ్యవస్థాపకుడు రమేశ్ నటరాజన్, గాయత్రి నటరాజన్ ఆధ్వర్యంలో కెనడాలోనే తొలిసారిగా హోమం నిర్వహించారు. స్థానికంగా, అమెరికా నుంచి, ఇండియా నుంచి తయారుచేసి తీసుకొచ్చిన లక్ష మోదకాలను స్వామికి సమర్పించి.. కొవిడ్ నుంచి లోకాన్ని రక్షించాలని కోరుకున్నారు. తాజాగా శుక్రవారం నుంచి రుద్రహోమం, చండీ హోమం నిర్వహిస్తున్నారు.
ప్రపంచ శక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒహాయోలోని హిందూ దేవాలయం ఆఫ్ డేటన్లో ఈ హోమాలను నిర్వహిస్తున్నట్టు రమేశ్ నటరాజన్ తెలిపారు. అందరికీ మహా గణపతి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.






Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

