ఐఐఎల్ నుంచి కొవాగ్జిన్?

హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): డిమాండ్‌కు తగినట్టుగా కొవాగ్జిన్ ఉత్పత్తిని పెంచడంపై భారత్ బయోటెక్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (ఐఐఎల్) సాయం తీసుకోనున్నట్టు తెలిసింది. కొవాగ్జిన్ యాంటీజెన్‌ను (న్యూట్రలైజ్ చేసిన వైరస్) ఐఐఎల్ ఉత్పత్తి చేసి భారత్ బయోటెక్‌కు సరఫరా చేయనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జూన్ రెండోవారంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని, జూలైలో భారత్ బయోటెక్‌కు అందిస్తుందని పేర్కొన్నాయి. భారత్ బయోటెక్ ఈ యాంటీజెన్‌ను ప్రాసెసింగ్ చేసి, వయల్స్‌లో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఇందుకోసం ఒకటి రెండు నెలల సమయం పడుతుందని అంచనా. ఐఎల్ఎల్ ప్రతినెల కోటి డోసుల యాంటీజెన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఐఐఎల్ ఇటీవల తమ ‘బీఎస్ఎల్ 2+’ ల్యాబ్‌ను ‘బీఎస్ఎల్ 3’కు అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Covaxin
- IIL
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

