యాంటిబాడీ కాక్టైల్ డ్రగ్

- ఒక్క డోస్ ధర రూ.59 వేలు
- సిప్లా సహకారం
- తొలిసారి యశోద దవాఖానలో
- కరోనా రోగులకు ఉపశమనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తొలిసారిగా కరోనాకు సంబంధించి ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ యాంటిబాడీ కాక్టైల్ డ్రగ్‌ను యశోద దవాఖాన అందుబాటులోకి తెచ్చింది. సిప్లా సహకారంతో ఈ డ్రగ్‌ను బుధవారం సికింద్రాబాద్ యశోద దవాఖానలో ప్రారంభించినట్టు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య తెలిపారు. తొలిరోజు ఇద్దరు రోగులకు ఈ డ్రగ్ ఇవ్వగా.. వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వివరించారు. గతేడాది ఫస్ట్ వేవ్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొవిడ్ పాజిటివ్ రావడంతో ఇదే డ్రగ్‌ను తీసుకొని త్వరగా కోలుకున్న విషయాన్ని గుర్తుచేశారు. డీసీజీఐ ఆమోదం పొందిన ఈ డ్రగ్ మూడురోజుల క్రితమే భారత్‌లో ప్రారంభించినట్టు వివరించారు. ఈ డ్రగ్ సత్వరమే రోగనిరోధకశక్తిని పెంచుతుందని, వైరల్ లోడ్ తగ్గించడంతో వైరస్ తీవ్రత తగ్గిపోతుందని చెప్పారు. ఈ డ్రగ్ రోగిలో ఇమ్యునోగ్లోబ్లిన్ (IgG1)ను ఉత్పత్తి చేయడంతో రోగనిరోధకశక్తిని పెంచే తెల్లరక్తకణాలను వృద్ధి చేస్తుందన్నారు. ‘క్యాసిరివిమాబ్, ఇమ్డెవిమాబ్’ అనేవి వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌ను అడ్డుకోవడంతోపాటు వైరస్ శరీర కణాల్లోకి ప్రవేశించకుండా బ్లాక్ చేస్తుందని తెలిపారు. పాజిటివ్ రోగులతో కాంటాక్ట్ అయినవారికి ముందస్తుగా ఈ డ్రగ్ ఇస్తే వారికి వైరస్ సోకదన్నారు. కుటుంబంలో ఎవరికైనా వైరస్ సోకినప్పుడు మిగిలినవారంతా ఈ డ్రగ్ తీసుకొంటే ముప్పుతప్పుతుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

