Gadwal | తన బైక్ ఇవ్వాలని అడిగినందుకు.. అతని భార్య సెల్‌కు అసభ్య వీడియోలు
ఓ మహిళ సెల్‌కు అసభ్య వీడియోలు పంపిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అతడి స్నేహితుడు వద్ద ఉన్న బైక్‌ను నెలన్నర కిందట తీసుకొని వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు.
- గద్వాల ఎస్పీకి ఫిర్యాదు.. కేసు నమోదు
Gadwal | గద్వాల అర్బన్, జనవరి 3 : ఓ మహిళ సెల్‌కు అసభ్య వీడియోలు పంపిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అతడి స్నేహితుడు వద్ద ఉన్న బైక్‌ను నెలన్నర కిందట తీసుకొని వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. తర్వాత బైక్‌ను సంఘటన స్థలం నుంచి అనిల్ స్నేహితులు నవీన్, వేణు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకొన్న యజమాని తన బైక్ ఇవ్వాలని పదే పదే కోరగా.. తమ వద్ద లేదని బుకాయించారు.
ఎన్నిసార్లు వారికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరకు తన భార్య మొబైల్ నుంచి ఫోన్ చేసేవాడు. భర్త ఇంట్లో లేని సమయంలో సదరు వ్యక్తులు ఆమెతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడటంతోపాటు ఆశ్లీల వీడియోలు పంపుతూ వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని సదరు మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బుధవారం ఎస్పీ రితిరాజ్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు గద్వాల టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

