ఊపిరితిత్తుల మాట వినండి!

- లంగ్స్ ఆరోగ్యంగా ఉంటే కరోనా ముప్పు తక్కువే
- కొవిడ్ సోకిన వెంటనే స్పందిస్తున్న ఊపిరితిత్తులు
- లక్షణాలను త్వరగా గుర్తిస్తే మేలంటున్న నిపుణులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. వైరస్ ముక్కు లేదా నోటి నుంచి గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి, అక్కడున్న వాయు కుహరాలను, కండరాలను ఇబ్బంది పెడుతుంది. దీంతో దగ్గు, దమ్ము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
కొందరిలో న్యుమోనియాకు దారితీస్తున్నది. ఆస్తమా, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక రోగుల్లో సమస్య మరింత తీవ్రం అవుతున్నది. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే వైరస్ ముప్పు కాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. శ్వాస వ్యవస్థలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే మన రోగ నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. దీంతో గొంతులో మంట, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వీటిని ముందుగానే గుర్తించగలిగితే వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీయకముందే కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోండి
- పెద్దవాళ్లు కనీసం 30 నిమిషాలు, యువత, పిల్లలు కనీసం 60 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. దీంతో శ్వాస తీసుకునే రేటు పెరిగి ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు శుభ్రం అవుతాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి.
- రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్తకణాల స్థాయిలను పరీక్షించుకోవాలి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును ప్రతిబింబిస్తాయి.
- పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు తినాలి. దీంతో శరీరంలోని విషపదార్థాలు నిర్వీర్యం అవుతాయి. అరటిపండ్లు, ఆపిల్, ద్రాక్ష, టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
గుర్తించడం ఎలా?
- గొంతు పొడిబారడం, గొంతునొప్పి
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులుంటే లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకుతున్నదని అర్థం చేసుకోవాలి.
- ఊపిరితిత్తుల దిగువ భాగంలో (చివరి పక్కటెముకల వద్ద) వాపు రావడం లేదా తీవ్రమైన నొప్పి వస్తే వెంటనే డాక్టర్‌ను కలువాలి.
- వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరగానే వాయు కోశాలు (అల్వియోలి) దానికి వ్యతిరేకంగా ద్రవరూప పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో శ్వాస తీసుకున్నప్పుడు, పక్కటెముకల కింద నొప్పి కలుగుతుంది.
- పొడిదగ్గు ఉండటం, దగ్గుతున్నప్పుడు ఛాతిలో నొప్పి/మంట అనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
- కరోనా లక్షణాలతోపాటు ఊపిరితీసుకోవడం ఇబ్బందిగా మారితే అప్పటికే 25% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ విస్తరించిందని అర్థం. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇవీ కూడా చదవండి…
ఏ చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది?
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

