Telangana | సామాన్యులకు షాక్.. కరెంటు బిల్లులు భారీగా పెంచేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్!
Telangana | విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కమ్‌లు కర్ణాటక రాష్ర్టాన్ని అనుసరించబోతున్నాయా? ఆ రాష్ట్రంలో వడ్డించినట్టుగా చార్జీలను పెంచబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఓ
Telangana | హైదరాబాద్, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : విద్యుత్తు చార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కమ్‌లు కర్ణాటక రాష్ర్టాన్ని అనుసరించబోతున్నాయా? ఆ రాష్ట్రంలో వడ్డించినట్టుగా చార్జీలను పెంచబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఓ అధికారి సైతం ఇదే తరహా సంకేతాలిచ్చారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీలను పెంచింది. 100 యూనిట్లలోపు రూ. 5.55, 200 యూనిట్లలోపు రూ.7.10, అంతకు మించితే రూ.8.15లు వసూలుచేస్తున్నది. ఇదే తరహాలో మన రాష్ట్రంలోనూ చార్జీలు పెంచాలన్న ఆలోచనలో డిస్కమ్‌ల అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఎవరైనా గృహజ్యోతి పరిధిలో లేకుండా 200 యూనిట్లు దాటితే వారిపై తీవ్రభారం మోపనున్నట్టు సమాచారం. ఇదంతా ప్రత్యక్షమే అయినప్పటికీ, ఇక పరోక్షంగా భారం మోపేందుకూ కొన్ని ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది.
సీల్డ్కవర్లో నివేదికల సమర్పణ
రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలు అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్(ఏఆర్ఆర్)ను తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాయి. రెండు డిస్కమ్‌లు సీల్డ్కవర్లో ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. ఇదే నివేదికలో డిస్కమ్‌ల లోటు వివరాలనూ పొందుపరిచాయి. అయితే, ఈ లోటును పూడ్చేందుకు రెండే మార్గాలున్నాయని, ఒకటి విద్యుత్తు చార్జీలను పెంచడం, రెండోది ప్రభుత్వ సబ్సిడీ మొత్తాన్ని పెంచడం. నిరుడు రెండు డిస్కమ్‌లకు కలిపి ప్రభుత్వం రూ.13వేల కోట్లకుపైగా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో సర్దుతామని చెప్పింది. కానీ, ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని డిస్కమ్‌లు అంటున్నాయి. రెండు డిస్కమ్‌లు కలిపి సబ్సిడీని మరింతగా పెంచాలని కోరనున్నాయి.
‘స్థానిక’ కోడ్ ముగిశాకే ఓపెన్..
రెండు విద్యుత్తు పంపిణీ సంస్థలైన ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు శనివారం ఈఆర్సీ ముందు ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాయి. వాస్తవానికి నవంబర్ 30లోపు సమర్పించాలి. కానీ, ఆ రోజు ఆదివారం కావడంతో శనివారం రాత్రే సమర్పించాయి. అయితే, ఈ నివేదికను తెరుద్దామా..? వద్దా? అని ఈఆర్సీ వర్గాలు తర్జనభర్జనకు గురయ్యాయి. స్థానిక ఎన్నికల కోడ్ ఉండటంతో తెరువకూడదని నిర్ణయించారు. డిసెంబర్ 18న కోడ్ ముగిసిన తర్వాతే ఈఆర్సీ ఈ నివేదికలను తెరిచే అవకాశమున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

