ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్
దేశంలో బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్' అని ఎద్దేవా చేశారు.
- దేశానికి పట్టిన దరిద్రం ఆ పార్టీ
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలో బ్రిటిష్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని, ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకున్నదని చెప్పారు. పదేండ్ల కింద ఇటలీ కాంగ్రెస్‌ను ప్రజలు వదిలించుకున్నారని, మళ్లీ ఆ పార్టీని ప్రజలు దగ్గరకు రానిచ్చే ప్రసక్తే ఉండబోదని స్పష్టంచేశారు. బీజేపీ పకా లోకల్ పార్టీ అని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని అన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అని, దేశానికి పట్టిన దరిద్రం ఆ పార్టీ అని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఉండవంటూ ప్రచారం చేస్తున్నారని, ‘మతి భ్రమించి మాట్లాడుతున్నారా?’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముస్లిం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నదని ఎవరో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీలుగా మారుస్తున్నారని, ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా? అని ప్రశ్నించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ రద్దు చేస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

