నేటినుంచి ఐనవోలు మల్లన్న జాతర
Inavolu | భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది.
వరంగల్: భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది. ఐనవోలు మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపుతుంది. జాతరకు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాల నిఘాలో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.
ఆలయానికి దారులు ఇవే..
ఆలయ భూమి చుట్టూ ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశం ఒక తూర్పు వైపు నుంచి మాత్రమే ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే భక్తులు తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి బైపాస్ రోడ్డు ద్వారా ఐనవోలు పాఠశాల వెనుక భాగం వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. కాలి నడుక ద్వారా తూ ర్పు ముఖం నుంచి లోపలికి ప్రవేశించాలి. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి వయా కూనూరు, గర్మిళ్లపల్లి నుంచి వచ్చే భక్తులు తాటి వనం దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. కాలి నడకన దేవాలయ తూర్పు వైపు నుంచి ఆలయంలోకి వెళ్లాలి. అదేవిధంగా హైదరాబాద్ పెద్దపెండ్యాల వయా వెంకటాపురం నుంచి వచ్చే భక్తులు వెంకటాపురం రోడ్డు ఒంటిమామిడిపల్లి రైస్ మిల్లు వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి.
కాలి నడకన తెలంగాణ తల్లి సెంటర్ నుంచి తూర్పు వైపు నుంచి ఆలయంలోకి వెళ్లాలి. తిమ్మాపురం క్రాస్ నుంచి వయా సింగారం, కొండపర్తి గ్రామాల నుంచి వచ్చే భక్తులు ఒంటిమామిడిపల్లి రోడ్డు ఐనవోలు 33/11 కేవి సబ్ స్టేషన్ దగ్గర వాహనాలను పార్కింగ్ చేయాలి. కాలినడకన తూర్పు వైపు నుంచి ఆలయానికి వెళ్లాలి. ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన భక్తులు కూడా తెలంగాణ తల్లి సెంటర్ వద్ద బస్సు దిగి కాలి నడకన తూర్పు వైపు నుంచి దేవాలయ ఆవరణంలోకి ప్రవేశించి, తిరిగి తూ ర్పు వైపు నుంచే బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

