హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రక్ట్-2021ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. అర్థ గణాంక, ప్రణాళిక, టీఎస్డీపీఎస్ శాఖ రూపొందించగా.. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్రెడ్డి, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, అర్థ గణాంక శాఖ అధికారులు డీ శివకుమార్, రామ బ్రహ్మం, రామకృష్ణ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.