దేశంలోనే తొలిసారి.. సిద్దిపేటలో తడి చెత్తతో సేంద్రీయ ఎరువు.. త్వరలో మార్కెట్లోకి
Siddipet Carbonlites | సిద్దిపేట మరో చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన సిద్దిపేట పట్టణం.. తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసింది. ఈ సేంద్రీయ ఎరువు సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ సన్నాహాలు చేస్తుంది.
సిద్దిపేట : సిద్దిపేట మరో చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన సిద్దిపేట పట్టణం.. తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసింది. ఈ సేంద్రీయ ఎరువు సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్దిపేట మున్సిపాలిటీ సన్నాహాలు చేస్తుంది. ఈ సేంద్రీయ ఎరువును నల్ల బంగారం అని పిలుస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట మున్సిపాలిటీ.. కార్బన్ మాస్టర్స్ కంపెనీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు వెలువడే 60 మెట్రిక్ టన్నుల వ్యర్థాల ద్వారా సీఎన్జీని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. ఈ వ్యర్థాల ద్వారా సేంద్రీయ ఎరువును కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 15 టన్నుల గార్డెన్ వేస్ట్, 10 టన్నుల ఆహార వ్యర్థాలను ఉపయోగించి బయో గ్యాస్‌ను ఉత్పత్తితో పాటు సేంద్రీయ ఎరువును తయారు చేస్తున్నారు. రోజుకు 100 నుంచి 120 బస్తాల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్బన్ మాస్టర్స్ సహా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ సోమ నారాయణ వెల్లడించారు. ప్రతి ఏడాది 4 వేల నుంచి 5 వేల బస్తాల ఎరువును తయారు చేస్తామన్నారు. 40 కిలోల బస్తా ధరను రూ. 300గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఈ ఎరువును మొదటగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విక్రయించాలని యోచిస్తున్నట్లు సోమ నారాయణ పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఇక్కడ రూ. 6 కోట్లతో బయో సీఎన్జీతో పాటు సేంద్రీయ ఎరువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. బయో సీఎన్జీ ప్రాజెక్ట్ ఇప్పటికే ఉత్ప్పత్తి ప్రారంభించింది. సిద్దిపేట మున్సిపాలిటీలో 41,332 కుటుంబాలు ఉన్నాయి. మున్సిపాలిటీ 52 వాహనాలను వినియోగించి చెత్తను సేకరిస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

