Northeast Monsoon | వాతావరణశాఖ తీపికబురు..! రెండురోజుల్లో తెలంగాణపై ‘ఈశాన్య’ ప్రభావం..!
Northeast Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షాలు ముఖంచాటేశాయి. దీంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి.
Northeast Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షాలు ముఖంచాటేశాయి. దీంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజుల్లో తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయవ్య దిశగా ప్రయాణిస్తు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగండంగా మారాక ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని, తీరం వెంట గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలున్నాయని చెప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

