ఐఐటీహెచ్ విద్యార్థికి 63.78 లక్షల ప్యాకేజీ
ఈ ఏడాది తొలి విడత ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు సాధించిన వార్షిక సగటు వేతన ప్యాకేజీ రూ.19.49 లక్షలుగా ఉన్నది. ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు స్వదేశీ కంపెనీలతోపాటు బహుళజాతి దిగ్గజ సంస్థలు
- వార్షిక సగటు వేతన ప్యాకేజీ 19.49 లక్షలు
- 54 కంపెనీల్లో 508 మందికి ప్లేస్మెంట్
- జనవరిలో మరో విడత ప్లేస్మెంట్ డ్రైవ్
హైదరాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది తొలి విడత ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీ-హైదరాబాద్ విద్యార్థులు మంచి వేతన ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. ఐఐటీహెచ్ విద్యార్థులు సాధించిన వార్షిక సగటు వేతన ప్యాకేజీ రూ.19.49 లక్షలుగా ఉన్నది. ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు స్వదేశీ కంపెనీలతోపాటు బహుళజాతి దిగ్గజ సంస్థలు సైతం ఆసక్తి చూపించాయి. విదేశీ స్టార్టప్ కంపెనీలు సైతం పోటీపడ్డాయి. దీంతో ఐఐటీహెచ్ విద్యార్థులకు ప్లేస్మెంట్ ధమాకా లభించింది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు మొదటి విడత ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ విడతలో మొత్తం 700 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 508 మంది 144 కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. వీరిలో 54 మంది అంతర్జాతీయ కంపెనీలకు ఎంపికయ్యారు. నిరుడు 12 అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ప్లేస్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనగా, ఈ ఏడాది 13 కంపెనీలు పాల్గొన్నాయి. ఐఐటీహెచ్‌లోని మొదటి గ్రాడ్యుయేషన్ బ్యాచ్ అయిన బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థుల్లో 82% మంది ప్లేస్మెంట్ దక్కించుకున్నారు. సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్‌షిప్‌లు సైతం గతం కన్నా పెరిగాయి. నిరుడు 33 ఇంటర్న్‌షిప్‌లు ఉంటే ఈ ఏడాది 51కి పెరిగాయి. బ్లెండ్ 360 కంపెనీ అత్యధికంగా ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్చేసుకున్నది. యాక్సెంచర్ జపాన్, డెన్సో, ఫ్లిప్‌కార్ట్, మోర్గాన్ స్టాన్లీ, ఎన్టీటీఏటీ, ఒరాకిల్, స్ప్రింక్లర్, సుజుకి మోటర్స్ కార్పొరేషన్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, టీఎస్ఎంసీ, జొమా టో తదితర సంస్థలు రిక్రూట్ చేసుకున్నాయి. మొదటి విడత ప్లేస్‌మెంట్స్ ముగియగా, ఫేజ్-2 ప్లేస్‌మెంట్స్ జనవరిలో ప్రారంభమవుతాయని ఐఐటీహెచ్ కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్చార్జి డాక్టర్ అభినవ్‌కుమార్ వెల్లడించారు.
ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాం
ఈ ఏడాది అత్యుత్తమ ప్లేస్మెంట్స్ను సొంతం చేసుకోవడం సంతోషదాయకం. బలమైన ఫండమెంటల్స్‌తో పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిరంతరం ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఈ ప్రయత్నమే విద్యార్థుల కలలను నెరవేర్చి అత్యుత్తమ ప్యాకేజీలను చేరువచేస్తున్నది. బీటెక్‌లో ఇంటర్న్‌షిప్, ఇంటర్ డిసిప్లినరీ ఎంటెక్ల వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలతోనే మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం.
– బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ డైరెక్టర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

