Young Liu: సీఎం కేసీఆర్ విజన్ ప్రేరణాత్మకం: ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూ
Young Liu: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీర్ విజన్ ప్రేరణాత్మకంగా ఉన్నట్లు యంగ్ లియూ అన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆయన హైదరాబాద్ ఆతిథ్యం పట్ల థ్యాంక్స్ తెలిపారు. తైవాన్‌కు రావాలంటూ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్(CM KCR) చేస్తున్న కృషి, ఆయన విజన్ తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని ఫాక్స్‌కాన్ చైర్మెన్(Foxconn Chairman) యంగ్ లియూ(Young Liu) అన్నారు. కొంగర కలాన్(Kongara Kalan)లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి రెండో తేదీన ఫాక్స్‌కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యంగ్ లియూ ఇవాళ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో తమ టీమ్ విజిట్ చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఆయన థ్యాంక్స్ తెలిపారు. హైదరాబాద్‌లో బస చేసిన సమయం అద్భుతంగా సాగిందన్నారు.
సీఎం కేసీఆర్‌పై తన లేఖలో ప్రశంసలు కురిపించారు యంగ్ లియూ. తన బర్త్‌డే సందర్భంగా కేసీఆర్ విషెస్ తెలిపారని, అలాగే తనకు పర్సనల్‌గా గ్రీటింగ్ కార్డు ఇవ్వడం పట్ల లియూ థ్యాంక్స్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల మీకు ఉన్న విజన్(KCR vision) నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ అన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త ఫ్రెండ్ దొరికినట్లు లియూ తన లేఖలో చెప్పారు. భవిష్యత్తులోనూ కేసీఆర్‌తో కలిసి పనిచేసేందకు ఉత్సాహాంగా ఉన్నట్లు తెలిపారు.
మార్చి 2వ తేదీన చర్చించినట్లే.. కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ను ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చైర్మెన్ లియూ తన లేఖలో తెలిపారు. వీలైనంత త్వరగా మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మీ టీమ్ సహకారాన్ని కోరనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను తైవాన్(Taiwan)కు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తైపి(Taipei)లో ఆతిథ్య సత్కారాలను అందుకోవాలని తన లేఖలో సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.
కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీ వల్ల లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఆదిబట్ల మున్సిపాలిటీ(Adibatla muncipality) పరిధిలోని కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పేందుకు తైవాన్ దేశం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

