హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై కాంగ్రెస్ సర్కార్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. కేటీఆర్ జన్మదినోత్సవం అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు. తెలంగాణ భవన్ మినహా హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను చించివేస్తున్నారు.
మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్నా వాటిని ముట్టుకోవడం లేదు. పక్కనే రేవంత్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నా వాటిని వదిలేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. రేవంత్ విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతోనే కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించి కాంగ్రెస్ సర్కారం రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
మన ఫ్లెక్సీలు ఉంచండి కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీ ఒక్కటి కూడా లేకుండా చింపేయండి
పక్కనే రేవంత్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఉన్నా వదిలేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే చింపుతున్న GHMC సిబ్బంది https://t.co/iiNc2G2pWN pic.twitter.com/YHvJAVd9A3
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం
కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన రేవంత్ సర్కార్
మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉన్నా… pic.twitter.com/KPXOzxCpp9
— BRS Party (@BRSparty) July 24, 2025
కేటీఆర్ పుట్టినరోజు ఫ్లెక్సీలు చింపుతిన్న అధికారులు
కాంగ్రెస్, బీజేపీ నాయకుల పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలు వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకుల పుట్టినరోజు కోసం పెట్టే ఫ్లెక్సీలు మాత్రమే చింపుతున్న GHMC, హైడ్రా అధికారులు https://t.co/XKLpwsHWTW pic.twitter.com/rSERnihspr
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2025