Hyderabad | భారత్‌లో గ్లోబల్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్, బెంగళూరు
భారత్‌లో గ్లోయాలబల్ కంపెనీల కార్యాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోనే ఏర్పాటు కానున్నట్టు సీబీఆర్ఈ ఇండియా తన నివేదికలో వెల్లడించింది.
- 2025 నాటికి సగం కార్పొరేట్ కార్యాలయాలు ఈ రెండు నగరాల్లోనే
- దేశంలోని 7 మెట్రో నగరాల వృద్ధిరేటుపై సీబీఆర్ఈ ఇండియా నివేదిక
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): భారత్‌లో గ్లోబల్ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోనే ఏర్పాటు కానున్నట్టు సీబీఆర్ఈ ఇండియా తన నివేదికలో వెల్లడించింది.
ఇప్పటికే హైదరాబాద్ వివిధ అంశాల్లో బెంగళూరును అధిగమించి మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తున్న విషయం విదితమే. ఈ రెండు నగరాల్లో మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవవనరులు అందుబాటులో ఉండటంతో పలు కంపెనీలు తమ గ్లోబల్ కేపబిలిటీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సీబీఆర్ఈ ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజైన్ స్పష్టం చేశారు.
భారత్‌లో ఆఫీస్ స్పేస్‌ను అందించడంలో బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా మారనున్నాయని, వీటి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై ఉన్నాయని తెలిపారు. బెంగళూరులో కొత్త కార్యాలయాల ఏర్పాటు ఎక్కువగా ఔటర్ రింగ్ రోడ్డు, నార్త్ బిజినెస్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నదని, హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌తోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

