ఆఫీస్ స్పేస్‌లో హైదరాబాద్ టాప్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరును అధిగమించింది
- బెంగళూరును అధిగమించిన హైదరాబాద్
- దేశంలోనే అగ్రస్థానానికి చేరిన విశ్వనగరం
- ‘రియల్’ అధ్యయన సంస్థ ‘వెస్టియన్’ వెల్లడి
- ‘హైదరాబాద్ 2.0’ పేరుతో నివేదిక విడుదల

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్న హైదరాబాద్ ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారత సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరును అధిగమించింది. తద్వారా దేశంలో హైదరాబాద్ అగ్రస్థానానికి దూసుకెళ్లినట్టు ప్రముఖ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపార అధ్యయన సంస్థ ‘వెస్టియన్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘హైదరాబాద్ 2.0’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో 2016 నుంచి 2022 వరకు ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ తదితర పలు రంగాల్లో నమోదైన అభివృద్ధిని విశ్లేషించారు. 2019లో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరి, సుమారు 1.15 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ వినియోగంలోకి వచ్చినట్టు తెలిపారు.
కొవిడ్ సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ మార్కెట్ చాలా స్థిరంగా ఉన్నదని, అమెరికా, యూరప్ దేశాల తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఐటీ కంపెనీల ఆఫీసులు ఉన్నాయని వివరించారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 69.6 లక్షల చదరపు అడుగులు గా నమోదైందని, 2020 కంటే ఇది 8% ఎక్కువన్నారు. ఈ ఏడాది ప్రథమార్థం (హెచ్1) చివరి నాటికి నగరంలో వ్యాపార సంస్థ లు 44 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకొన్నాయని, ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న డిమాండ్ కంటే 72% ఎక్కువని ‘వెస్టియన్’ నివేదిక వెల్లడించింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

