Cyber crime | రెండేండ్లలో 705 కోట్లు కొట్టేశారు.. అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరస్థుల ఎత్తుగడలు
‘తెలంగాణ పౌరులారా.. సైబర్‌నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రజలను హెచ్చరిస్తున్నది. అనుక్షణం సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్‌నేరస్థులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ.. అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఉద్యోగం, డబ్బు, అమ్మాయిలు, అబ్బాయిలను ఆశచూపి అందినకాడికి దోచుకుంటున్నారు.
- గంటకు 4.41 లక్షల దోపిడీ
- తొలిస్థానంలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు
- పదో స్థానంలో సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్
- ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
Cyber crime | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ పౌరులారా.. సైబర్‌నేరాలపట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది’ అని రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రజలను హెచ్చరిస్తున్నది. అనుక్షణం సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో సైబర్‌నేరస్థులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ.. అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఉద్యోగం, డబ్బు, అమ్మాయిలు, అబ్బాయిలను ఆశచూపి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా దాదాపు 22 నెలల్లో సుమారు రూ.705.88 కోట్లను కంటికి కనిపించకుండా దోచేశారు. నిరుడు సుమారు రూ.304 కోట్ల ప్రజల సొమ్ము మాయం చేశారు.
నెలకు రూ.32 కోట్ల చొప్పున
అవగాహన లేమితో స్మార్ట్‌ఫోన్ వాడే వారికి కొత్తకొత్త ఆఫర్లు, ఉద్యోగ అవకాశాలు, పార్ట్‌టైమ్ జాబ్స్, లోన్లు ఇప్పిస్తామని ఊదరగొడుతూ నేరగాళ్లు ఆకట్టుకుంటున్నారు. వాటికి ఆశపడి క్లిక్ చేసిన వెంటనే తెలివిగా వారితోనే బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు చెప్పిస్తూ సులువుగా డబ్బులు గుంజుతున్నారు. డబ్బులు పోయిన వెంటనే పోలీసులను, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌ను సంప్రదించటంతో సుమారు రూ.100 కోట్ల నగదును ఫ్రీజ్ చేయగలిగారు. గణాంకాలను బట్టి చూస్తే.. నెలకు రూ.32 కోట్లు.. రోజుకు రూ.1.06 కోట్లు, గంటకు రూ.4.14 లక్షల నగదును కంటికి కనిపించకుండా దోచుకుంటున్నారు. 2022-23లో సుమారు 50,374 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల నుంచి సుమారు రూ.304 కోట్లను దండుకున్నారు సైబర్‌నేరగాళ్లు. చాలామందికి ఇలాంటి నేరాలపై అవగాహన లేకపోవటంతో డబ్బులు మోసపోయిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తున్నారు. అప్పటికే కేటుగాళ్లు డబ్బులు తమ అకౌంట్లలోకి క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చుకుంటున్నారు.
ఇన్వెస్ట్మెంట్ మోసాలే అధికం
సైబర్‌క్రైమ్ మోసాల్లో ఈ ఏడాది ఎక్కువగా బిజినెస్ పేరు చెప్పి ఇన్వెస్ట్ చేయించేవే అధికంగా నమోదు అయ్యాయి. 2023 జనవరి నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ క్యాటగిరీ కింద సుమారు 3,743 ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో అమ్మాయి లేదా అబ్బాయిలాగా నమ్మించి మోసం చేసినవి 1,982 కేసులు నమోదు అయ్యాయి. టాప్-10లో చివరిస్థానంలో సోషల్ మీడియా నకిలీ అకౌంట్లు సృష్టించి వాటితో డబ్బులు డిమాండ్ చేయటం నిలిచింది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు కస్టమర్ కేర్లకు సంబంధించిన సమాచారాన్ని గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లలో వెతకొద్దని కోరుతున్నారు. ఇలాంటి కేసులు ఈ ఏడాది 1,902 నమోదు అయ్యాయి. మోసానికి గురయ్యామని తెలిసి వెంటనే 1930కి కాల్ చేయాలని, లేదంటే https:// cybercrime.gov.in/లో ఫిర్యాదు చేయాలని సైబర్ పోలీసులు కోరుతున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా టాప్-10 సైబర్ మోసాలు, నమోదైన కేసులు (2023 జనవరి – 2023 ఏప్రిల్ 21)
1. బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 3,743
2. అమ్మాయి/అబ్బాయిలా నమ్మించిన మోసాలు 1,982
3. నకిలీ కస్టమర్‌కేర్ సర్వీస్ (గూగుల్) కేసులు 1,902
4. క్రెడిట్‌కార్డుల సిమ్మింగ్/క్లోనింగ్ 1,544
5. లోన్ ఇప్పిస్తామని మోసాలు 1,220
6. క్రెడిట్, డెబిట్ కార్డులను పాన్‌కార్డు లింక్ పేరిట (ఎస్ఎంఎస్) మోసం 1,157
7. లోన్లు ఇప్పిస్తామని మోసాలు 1,148
8. పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్ 1,079
9. ఓఎల్ఎక్స్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో యాడ్స్ ద్వారా మోసం 872
10. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా 833
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

