Begging Mafia | బెగ్గింగ్ మాఫియాపై వెస్ట్‌జోన్ పోలీసుల కొరడా
Begging Mafia | నగరంలో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి.
హైదరాబాద్: నగరంలో బెగ్గింగ్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులను రద్దీ ఎక్కువగా ఉండే చౌరస్తాల్లో విడిచిపెట్టి భిక్షాటన చేయిస్తూ ఈ ముఠాలు లక్షలు వెనకేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వెస్ట్‌జోన్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. బెగ్గింగ్ మాఫియాల ఆటకట్టిస్తున్నారు. బెగ్గింగ్ మాఫియా చేతిలో భిక్షగాళ్లుగా మారిన వారిని రక్షిస్తూ.. ముఠా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ బెగ్గింగ్ మాఫియా నాయకులు భిక్షాగాళ్లు సేకరించిన నగదు నుంచి వారి కేవలం రూ.100, రూ.200 ఇస్తూ మిగతాదంతా తమ జేబుల్లో నింపుకుంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా ఒక్కో బెగ్గింగ్ గ్యాంగ్ నడిపే వ్యక్తి నెలకు రూ.2,00,000 నుంచి రూ.3,00,000 లక్షల వరకు వెనుకేసుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
తాజాగా చిన్న పిల్లలను యాచకులుగా మార్చి రోడ్లపై వదిలేసి సాయంత్రానికి వారు తీసుకొచ్చిన డబ్బులను వసూలు చేసుకుంటున్న బెగ్గింగ్ ముఠా నిర్వాహకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ హనుమంతరావు, జూబ్లీహిల్స్ ఏసీపీ కె హరిప్రసాద్, సీఐ రామకృష్ణతో కలిసి వివరాలు వెల్లడించారు. ఫిలింనగర్, బసవతారకం నగర్ బస్తీకి చెందిన వీ సూర్యప్రకాశ్ (36) ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. జల్సాలు, మద్యానికి బానిసైన అతను సులువుగా డబ్బులు సంపాదించేందుకు బెగ్గింగ్ మాఫియాకు తెరలేపాడు. ఐదుగురు పిల్లలను చేరదీసి వారికి స్టీల్ బాక్సులు ఇచ్చి ఫిలింనగర్ బస్టాప్, పరిసర ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేయించేవాడు. సాయంత్రం వారు తీసుకొచ్చే డబ్బులు లాక్కునేవాడు. ప్రతిరోజూ ఒక్కొక్కరికి రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలయ్యేవి. ఇందులో రూ.100 చొప్పున భిక్షాటన చేసిన పిల్లలకు ఇచ్చి మిగతావి తాను తీసుకునేవాడు. దీనిపై సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఫోలీసులు, ఫిలింనగర్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పిల్లలను రక్షించి మోండా మార్కెట్లోని అమన్వేదిక స్నేహగర్కు తరలించారు. నిందితుడి నుంచి స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

