Rain Alert | రాష్ర్టానికి ‘మోచా’ ముప్పు.. మరో రెండు రోజులు వానలు
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు ‘మోచా’ తుఫాన్ ఏర్పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నది.
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Rain Alert | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు ‘మోచా’ తుఫాన్ ఏర్పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నది.
మోచా కారణంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో జల్లులు పడతాయని వెల్లడించింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. ఈ నెల 6, 7 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశమున్నదని తెలిపింది.
కాగా, శుక్రవారం ఆదిలాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 34.5 డిగ్రీలు, జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్‌నగర్‌లో అత్యల్పంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 30 డిగ్రీల లోపు గరిష్ఠ, 20 డిగ్రీలపైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. పగటి పూట కాస్త ఎండ ప్రభావం, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

