ACB | హైదరాబాద్ : హైదరాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారిణి(CDPO) అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్ కోర్టులో ఆమెను హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా జైనూరులో గతంలో సీడీపీవోగా పని చేసిన సమయంలో ఆమె నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. 322 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ. 65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.