దేశానికే ‘ఔషధం’

- ఫార్మా హబ్‌గా హైదరాబాద్
భారతీయ ఔషధ రంగానికి ప్రధాన కేంద్రం హైదరాబాదే. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కూడా కొనసాగుతున్నది. అందుకే కరోనా విపత్తు సమయంలోనూ గణనీయమైన వృద్ధిని తెలంగాణ సాధించింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణలోని ఫార్మా సంస్థలదే కీలక పాత్ర. టీకాలతోపాటు రెమ్‌డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరవిర్ వంటి ప్రాణాధార ఔషధాలను ఉత్పత్తి చేశాయి. ఐసీఎంఆర్ అనుమతించిన తొలి ఆర్టీపీసీఆర్ కిట్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అయ్యాయి. దీంతోపాటు అనేకానేక కంపెనీలు పీసీఆర్ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వైరస్‌ను రవాణా చేసే పరికరాలు, రియేజెంట్స్, ఇతర ద్రావణాలను హైదరాబాద్ కేంద్రంగానే ఉత్పత్తి చేశాయి. ఇక దేశీయంగా మొట్టమొదటి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ హైదరాబాదీ సంస్థే కావడం గర్వకారణం.
జీనోమ్ వ్యాలీ ఖ్యాతి
దేశంలోనే అతిపెద్ద ఆర్అండ్డీ క్లస్టర్‌గా, ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా జీనోమ్ వ్యాలీ నిలిచింది. దేశీయ టాప్-5 వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక మంత్రి కేటీఆర్ గతేడాది ఆగస్టు 4న జీనోమ్ వ్యాలీని సందర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి ఏ దశలో ఉన్నదో కూడా పరిశీలించారు. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థల అధినేతలను, శాస్త్రవేత్తల బృందాలను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఈ పర్యటన మరోసారి రుజువు చేసింది.
వర్చువల్ బయో ఏషియా-2021
- ఆసియాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ఫోరంగా నిలుస్తున్న బయో ఏషియా సదస్సు ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23 తేదీల్లో నిర్వహించిన ఈ 18వ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాలకు చెందిన 31,450 మంది ప్రముఖులు హాజరయ్యారు.
- బీ-హబ్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు, పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ‘బయోఫార్మా హబ్’ను ఏర్పాటు చేశారు.
- మెడికల్ డివైజెస్ పార్క్: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్ 2020-21లో అనేక కంపెనీలను ఆకర్షించింది. 19 కంపెనీలకు భూములనూ కేటాయించారు. రూ.204 కోట్ల పెట్టబడి రాగా, 2,400 మందికి ఉపాధి లభించనున్నది.
లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు
- మెడ్‌ట్రోనిక్ రూ.1,200 కోట్లు: మంత్రి కేటీఆర్ గతేడాది ఆగస్టు 11న మెడ్‌ట్రోనిక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై మెడికల్ డివైజెస్ పార్క్ గురించి వివరించారు. ఫలితంగా కంపెనీ రూ.1,200 కోట్ల పెట్టుబడితో భాగ్యనగరంలో ఆర్అండ్డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
- సాయి లైఫ్ సైన్సెస్: సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తన కొత్త రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించనున్నట్టు గతేడాది ఆగస్టు 15న ప్రకటించింది.
- లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ: లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
- లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రతిపాదిత సంస్థలు 311
- మొత్తం పెట్టుబడులు రూ.6,734.56 కోట్లు
- ఉపాధి పొందే వారు 34,000
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

