మందుబాబు అతి వేగానికి ఏఎస్సై బలి

- రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ మృతి
- అవయవదానంతో మరో 8 మంది జీవితాల్లో వెలుగు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఓ మందుబాబు నిర్లక్ష్యం కారణంగా విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. మరణంలోనూ అవయవదానంతో మరో 8 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 27న నిజాంపేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఓ మందుబాబు ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణకు దిగి హోంగార్డు, కానిస్టేబుళ్లను గాయపర్చాడు. కూకట్పల్లి స్టేషన్ ఏఎస్సై మహిపాల్‌రెడ్డి ఘటన వివరాలను సేకరిస్తుండగా.. మద్యం మత్తులో ఓ క్యాబ్ డ్రైవర్ వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టాడు. మహిపాల్‌రెడ్డికి తీవ్రగాయాలై దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించాడు. దుఃఖంలోనూ మహిపాల్‌రెడ్డి కుటుంబం.. ఆయన అవయవాలను ఎనిమిది మందికి దానం చేసింది. బుధవారం రాజేంద్రనగర్ బండ్లగూడ కిస్మత్పుర ప్రాంతంలో ఏఎస్సై అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పాడె మోశారు. మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్‌పై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

