Karthika Masam | కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు.. ఎములాడ రాజన్నకు ప్రత్యేక పూజలు
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కంటి సన్నిధిలో దీపాలు వెలిగిస్తున్నారు. భద్రాచలంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. కార్తిక దీపాలు వదులుతున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కల్యాణ మండపంలో కార్తిక పురాణ ప్రవచనం గావిస్తున్నారు. రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సాయంత్రం సామూహిక కార్తిక దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక హైదరాబాద్‌లోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే స్వామివారిని దర్శించుకున్న భక్తులు, కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. కాగా, కార్తికమాసం సందర్భంగా భక్తుల కోసం పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. వివిధ డిపోల నుంచి అన్నవరం, కాళేశ్వరం, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడతోపాటు ప్రసిద్ధ శివాలయాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

