Budget | విద్యారంగం నిర్వీర్యానికి కాంగ్రెస్ కుట్ర.. సూర్యాపేటలో విద్యార్థుల భారీ నిరసన ర్యాలీ
Budget | విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్‌ఎయూ, పీవైఎల్ (PDSU) ఆధ్వర్యంలో సూర్యాపేటలో (Suryapet) విద్యార్థులు భారీ నిరసన(Huge protest) ర్యాలీ చేపట్టారు.
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై(Budget) అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కారు(Congress) దగా చేయడంపై విద్యార్థులు, నిరుద్యోగులు రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పీడీఎస్‌ఎయూ, పీవైఎల్ (PDSU) ఆధ్వర్యంలో సూర్యాపేటలో (Suryapet) విద్యార్థులు భారీ నిరసన(Huge protest) ర్యాలీ చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు.
కాగా, గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలండర్ ప్రకటన అమ లు కోసం బడ్జెట్లో ఒక్క రూపాయీ ప్రతిపాదించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిరుద్యోగులకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతి హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండాపోయింది. గతంలో కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల కోసం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించారు. గ్రూప్-1, 2, 3, 4 వం టి నోటిఫికేషన్లతోపాటు టీచర్, పోలీసు, గురుకుల టీచర్ పోస్టులు, స్టాఫ్‌నర్స్ తదితర వేలాది ఉద్యోగాల భర్తీకి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని నిరుద్యోగులు రగిలిపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

