హోంగార్డుల రైజింగ్ డే నిర్వహిస్తారా? లేదా?
హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి.
- గత సంవత్సరం కూడా చెయ్యిచ్చిన ప్రభుత్వం
- ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హోంగార్డులు
- త్యాగాలను అవమానిస్తున్నారని ధ్వజం
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా డిసెంబర్ 6న నిర్వహించే రైజింగ్ డే వేడుకలకు వారం రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన హోంగార్డులను ఎంపిక చేయడం, జిల్లాల్లో హోంగార్డులను ఒక చోటికి చేర్చి కవాతు నిర్వహించడం, ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ పెట్టడం, ప్రశంసాపత్రాలు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ రోజు హోంగార్డులకు ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేయడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. అయితే, గత సంవత్సరం కొన్ని జిల్లాల్లో కేవలం రక్తదాన శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఈ సంవత్సరం ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రభుత్వం నుంచి పోలీసుశాఖకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో హోంగార్డులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రైజింగ్ డే ప్రాధాన్యత తెలిసిన రెండు, మూడు జిల్లాల ఎస్పీలు మాత్రం స్పోర్ట్స్మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఈ సారి పరేడ్ నిర్వహించనున్నట్టు సమాచారం.
రూ.79 పెంచి.. రూ.1,000 పెంచినట్టు కలరింగ్
రైజిండ్ డే వీక్ ప్రారంభమైనా పోలీసుశాఖ ఎలాంటి శుభవార్త చెప్పలేదని హోంగార్డులు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే రోజువారీ వేతనంతో వెట్టి చాకిరి చేయాల్సి వస్తున్నదని, అయినా తమను గుర్తించే నాథులే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది పాలనలో కేవలం 79 రూపాయలు పెంచి.. 1,000 రూపాయలు పెంచినట్లుగా ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు అధికారులకు అమలు చేస్తున్న ఆరోగ్య భద్రతను తమకూ కల్పించాలని కోరితే.. కేవలం ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హోంగార్డులు తెలిపారు. ఈసారి కూడా హోంగార్డ్స్ రైజింగ్ డే నిర్వహించకపోతే ముమ్మాటికీ తమ త్యాగాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుశాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలని హోంగార్డులు కోరారు. ఎన్నికలప్పుడు ప్రస్తావించిన ‘ఆర్డర్లీ వ్యవస్థ’ రద్దు అంశాన్ని కూడా తేల్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

